కటింగ్ షాపులకు ఉచిత విద్యుత్ కొనసాగింపు – ముప్పు శ్రీనివాస్ రెడ్డి

కటింగ్ షాపులకు ఉచిత విద్యుత్ కొనసాగింపు – ముప్పు శ్రీనివాస్ రెడ్డి

_నాగారంలో నాయి బ్రాహ్మణ సంఘంతో ఉగాది శుభాకాంక్షలు 
_ చిన్న వ్యాపారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని వ్యాఖ్య

నాగారం, మార్చ్ 20 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ జిల్లా నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఉగాది పర్వదినం సందర్భంగా స్థానిక నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులతో సమావేశమై శుభాకాంక్షలు తెలియజేశారు. నాగారం నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బాలకిషన్ నాయి ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా ముప్పు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులను ప్రోత్సహించే దిశగా కటింగ్ షాపులకు ఉచిత విద్యుత్ సరఫరాను కొనసాగించడం గొప్ప నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తుకారాం నాయి, ఉపాధ్యక్షులు శ్రీకాంత్ నాయి, ప్రసాద్ నాయి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖర్ నాయి, జాయింట్ కార్యదర్శి వెంకటేష్ నాయి, సలహాదారు నరసింహ నాయి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .