గ్యాస్ బుకింగ్‌పై అవగాహన పెంచాలి హెచ్‌పీ గ్యాస్ మేనేజర్ నరేష్

గ్యాస్ బుకింగ్‌పై అవగాహన పెంచాలి హెచ్‌పీ గ్యాస్ మేనేజర్ నరేష్

కుషాయిగూడ, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):

గ్యాస్ బుకింగ్ విధానం పట్ల ప్రతి వినియోగదారుడు అవగాహన కలిగి ఉండాలని శ్రీ వెంకటేశ్వర హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ ఆడబాల నరేష్ సూచించారు. కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడలో ఉన్న కార్యాలయంలో వినియోగదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ సరఫరా ఆలస్యమవుతోందనే అపోహలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు. అనేక మంది వినియోగదారులు గత కొన్ని నెలలుగా క్యాష్ బుకింగ్ చేసుకోవడం వల్ల బ్లాక్‌లిస్టులోకి వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దాని వల్ల ఆన్లైన్ బుకింగ్ తక్షణం జరగకపోవచ్చని చెప్పారు.కొంతమంది వినియోగదారులు ఈ-కేవైసీ పూర్తి చేయకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి వినియోగదారుడు అవసరమైన ప్రతిసారి గ్యాస్ బుకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలని, బుకింగ్ విధానాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.గ్యాస్ కొరత ఏ మాత్రం లేదని స్పష్టం చేసిన ఆయన, ప్రస్తుతం రోజుకు నాలుగు నుంచి ఐదు వేల బుకింగ్లు నమోదవుతున్నాయని తెలిపారు. గతంలో రోజుకు సుమారు 900 బుకింగ్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు మూడు నుంచి నాలుగు రెట్లు పెరగడంతో సరఫరాలో కొంత ఆలస్యం జరుగుతోందని వివరించారు.వినియోగదారులు 8888823456, 9493602222 నంబర్ల ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. బుకింగ్ సమయంలో వచ్చే ఓటీపీని తప్పనిసరిగాగుర్తుంచుకోవాలనిసూచించారు.వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని మేనేజర్ నరేష్ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .