మాజీ ఎమ్మెల్యే దేవేందర్ గౌడ్‌కు జన్మదిన వేడుకలు

మాజీ ఎమ్మెల్యే దేవేందర్ గౌడ్‌కు జన్మదిన వేడుకలు

కుషాయిగూడ, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):

మాజీ హోం శాఖ మంత్రి తుల్లా దేవేందర్ గౌడ్ జన్మదినం సందర్భంగా నాయకులు, అభిమానులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువ నాయకుడు రేగళ్ల సతీష్ రెడ్డి తుక్కుగూడలోని ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ, సమైక్య ఆంధ్రప్రదేశ్ కాలంలో మేడ్చల్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన దేవేందర్ గౌడ్, బీసీ సంక్షేమం, ప్రొహిబిషన్, సినిమాటోగ్రఫీ, రెవెన్యూ, హోం శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించి ప్రజలకు విశేష సేవలు అందించారని అన్నారు.అలాగే తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగి, అనంతరం రాజ్యసభ సభ్యునిగా సేవలందిస్తూ పేద, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసి ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోలూరి నాగార్జున, రఘుమా రెడ్డి, ఏరేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .