జయన్న తిరుమలాపురం ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శంగా నిలవాలి

జిల్లెల చిన్నారెడ్డి 

జయన్న తిరుమలాపురం ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శంగా నిలవాలి

వనపర్తి,మార్చి18(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండలం జయన్న తిరుమలాపురం గ్రామంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సులో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు.స్వాతంత్ర్యం అనంతరం దేశంలో ఆకలి సమస్య తీవ్రంగా ఉండగా, హరిత విప్లవంతో ఆహార ఉత్పత్తి పెరిగిందని గుర్తుచేశారు.అయితే రసాయనిక ఎరువుల అధిక వినియోగం వల్ల భూముల సారం తగ్గి, ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు.అందుకే మళ్లీ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు.రైతులు ఆదాయం పెంచుకునేందుకు కూరగాయల సాగు, పాడి పరిశ్రమ, కోళ్లు, గొర్రెల పెంపకం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ఆయన సూచించారు.జయన్న తిరుమలాపురం గ్రామంలో ఇప్పటికే 125 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తుండటం అభినందనీయమని అన్నారు.ఈ సందర్భంగా రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామపెద్దలు మరియు రైతులు పాల్గొన్నారు. IMG-20260318-WA0037

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం
జమ్మికుంట టౌన్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ నూతన పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో పట్టణంలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్...
గిరిజనలకు ఇచ్చిన హామీలను అమలుకై 25వేల కోట్లు కేటాయించాలి 
రంగాపూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు
గీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం -- చైర్మన్ సుహాసిని.
ఆపదలో అండగా పీఆర్టీయూ టిఎస్ ఉపాధ్యాయ సంఘం 
శ్రీ పరాభవ ఉగాది.... వసంత శోభ
తోవ