ఆపదలో అండగా పీఆర్టీయూ టిఎస్ ఉపాధ్యాయ సంఘం
హన్మకొండ,మార్చి18(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ బాలుర ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ రచయిత, కవి, మాజీ పాత్రికేయుడిగా గుర్తింపు పొందిన మెండు ఉమామహేశ్వర్ మరణం పీఆర్టీయూ టీఎస్ సంఘానికి తీరని లోటుగా మారింది. గతంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పనిచేసిన ఆయన సేవలను సంఘ నాయకులు స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మందల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఫలిత శ్రీహరి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పీఆర్టీయూ క్రియాశీల సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయ సంక్షేమ నిధి నుంచి ఒక లక్ష రూపాయల చెక్కును కుటుంబానికి అందజేశారు.
తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం సంఘానికి ముఖ్య లక్ష్యమని, ప్రతి సభ్యునికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. శ్రీహరి మాట్లాడుతూ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని సదుపాయాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షుడు యాకూబ్ రెడ్డి, ధర్మసాగర్ మండల శాఖ అధ్యక్షుడు అనిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జాన్ సింగ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేశవ రెడ్డి, నాయకులు సురేష్, రవి, జాఫర్గఢ్ మండల మహిళా ఉపాధ్యక్షురాలు నీరజ, వెంకట్ రెడ్డి, మెండు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments