కుషాయిగూడలో పాన్, టీ షాప్‌లలో చోరీ

కుషాయిగూడలో పాన్, టీ షాప్‌లలో చోరీ

_తాళాలు పగలగొట్టి నగదు, సిగరెట్ ప్యాకెట్లు అపహరణ 

– కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

కుషాయిగూడ, మార్చ్ 18 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఉన్న పాన్ షాప్, టీ షాప్‌లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. భరత్ నగర్ జమ్మిగడ్డకు చెందిన కంచు గంట్ల భాస్కర్ నిర్వహిస్తున్న ఈ షాప్‌లకు మార్చి 17న రాత్రి తాళాలు వేసి వెళ్లగా, మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా షట్టర్ తెరవబడి ఉండటం, తాళాలు పగలగొట్టబడటం గుర్తించాడు.షాప్‌లలోని వస్తువులు చిందరవందరగా ఉండటంతో పాటు సిగరెట్ ప్యాకెట్లు, కొంత నగదు అపహరించబడినట్లు తేలింది. బాధితుడి ఫిర్యాదుతో కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .