తోవ 

తోవ 

సున్నితమైన మనసును
గాయపరిచిన తర్వాత
మనుషులు నిశ్శబ్దమై పోతారు
మాటలు తగ్గి
నవ్వు మసకబారుతుంది
చిన్న విషయాలకు అతి స్పందన
పెద్దవాటికి మౌనం వహించాల్సి వస్తుంది
నమ్మకం రంగు తెగిపోతుంది
రాత్రులు ఎడారి దీపాలవుతాయి
నిద్ర చిన్నదిగా మిగిలిపోతుంది
 ఉదయం లేచినా
రోజు మొదలవదు
తాము పూర్తిగా మారిపోయామని
 ఒక దినానికి అర్థమవుతుంది
ఆ మార్పును తిరిగి తీసుకురాలేమని తెలుస్తుంది
ఇక్కడే ఉండి
మరో జన్మలోకి ప్రయాణం ప్రారంభమవుతుంది
మనసుకు గాయమైతే
దేహం బూడిదవుతుంది .


✍️మండాది గోపీనాథ్
ముక్కుడు దేవులపల్లి

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .