ఎస్సీ యాక్షన్ ప్లాన్ అమలుకు డీసీసీ సమావేశం

ఎస్సీ యాక్షన్ ప్లాన్ అమలుకు డీసీసీ సమావేశం

_నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై దృష్టి 

– బ్యాంకర్లకు అదనపు కలెక్టర్ ఆదేశాలు

మేడ్చల్ మల్కాజ్గిరి, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 అమలుకు సంబంధించి ప్రత్యేక బ్యాంకర్ల (డీసీసీ) సమావేశం నిర్వహించారు. జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంపై అధికారులు, బ్యాంకర్లు విస్తృతంగా చర్చించారు. పథకం కింద రూ.1 లక్ష విలువ గల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 90% సబ్సిడీతో అందించబడతాయని తెలిపారు. గిగ్ వర్కర్లుగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లలో పనిచేస్తున్న వారికి ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.అలాగే రూ.3 లక్షల విలువ గల గూడ్స్/ప్యాసింజర్ త్రిచక్ర వాహనాలు 70% సబ్సిడీతో, రూ.3 నుండి 7 లక్షల విలువ గల సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లు 60% సబ్సిడీతో మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకాల ద్వారా యువతకు స్థిరమైన ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు ఈ పథకం కింద 215 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 106 త్రిచక్ర వాహనాలు, 22 సోలార్ యూనిట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ యూనిట్లను త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని బ్యాంకర్లకు సూచించారు.అర్హులైన ఎస్సీ అభ్యర్థులు మార్చి 24, 2026 లోగా దరఖాస్తులు సమర్పించాలని, బ్యాంకులు వాటిని వేగంగా పరిశీలించి రుణాల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె. బాబు మొజెస్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సి. శివ ప్రసాద్‌తో పాటు వివిధ బ్యాంకుల జిల్లా అధికారులు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం
జమ్మికుంట టౌన్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ నూతన పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో పట్టణంలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్...
గిరిజనలకు ఇచ్చిన హామీలను అమలుకై 25వేల కోట్లు కేటాయించాలి 
రంగాపూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు
గీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం -- చైర్మన్ సుహాసిని.
ఆపదలో అండగా పీఆర్టీయూ టిఎస్ ఉపాధ్యాయ సంఘం 
శ్రీ పరాభవ ఉగాది.... వసంత శోభ
తోవ