దొంగతనం కేసులో నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు

దొంగతనం కేసులో నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు

స్టేషన్ ఘనపూర్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని శివునిపల్లిలో జరిగిన దొంగతనం కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తూర్పు గోదావరి జిల్లా రాజావోమంగి మండలం మంచంగి గ్రామానికి చెందిన తలుపులయ్య (40), తానేదార్‌పల్లి గ్రామంలో గడం కొమురయ్యకు చెందిన కోళ్ల ఫారం వద్ద పని కుదుర్చుకున్నాడు. యజమాని ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదునుగా చూసుకొని ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన ఇంట్లోకి చొరబడి సుమారు రెండున్నర తులాల బంగారాన్ని దొంగిలించాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మార్చి 18న శివునిపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల సమయంలో ఐపీఎస్ అధికారి మనిషా ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో అతడు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు.
నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు.
ఈ కేసులో పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు.IMG-20260318-WA0017

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం
జమ్మికుంట టౌన్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ నూతన పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో పట్టణంలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్...
గిరిజనలకు ఇచ్చిన హామీలను అమలుకై 25వేల కోట్లు కేటాయించాలి 
రంగాపూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు
గీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం -- చైర్మన్ సుహాసిని.
ఆపదలో అండగా పీఆర్టీయూ టిఎస్ ఉపాధ్యాయ సంఘం 
శ్రీ పరాభవ ఉగాది.... వసంత శోభ
తోవ