తాళం పగులగొట్టి దొంగతనం చేసిన నిందితుడు అరెస్ట్

తాళం పగులగొట్టి దొంగతనం చేసిన నిందితుడు అరెస్ట్

కీసర, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి దొంగిలించిన బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుభాష్ నగర్ కాలనీకి చెందిన ఆరుమళ్ల వెంకట్ రెడ్డి ఈ నెల 16న ఉదయం సుమారు 9 గంటలకు తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు.అనంతరం మధ్యాహ్నం 12:05 గంటలకు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టబడినట్లు గుర్తించారు.ఈ ఘటనలో కీసర ప్రాంతానికి చెందిన బాల నేరస్థుడు దర్యాగుల జగదీష్ అలియాస్ సంతోష్ అలియాస్ సంతు ఇంట్లోకి చొరబడి, అల్మిరాలోని బంగారు ఉంగరాలు, చిన్న గొలుసు, చెవి దిద్దులు (మాటీలు) మరియు రియల్‌మీ మొబైల్ ఫోన్‌ను దొంగిలించినట్లు తేలింది.పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కీసర పోలీస్ ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి, మార్చ్ 18న బుధవారం రోజు నిందితుడిని పట్టుకుని, దొంగిలించిన వస్తువులను రికవరీ చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లేటప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కీసర పోలీసులు ప్రజలకు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .