ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ

ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ

ఘట్కేసర్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ ప్రతాప్ సింగారం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు రంజాన్ “తోఫా” కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక బిలాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా ప్రజలు పాల్గొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి హాజరై లబ్ధిదారులకు రంజాన్ తోఫా కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న తోఫా కిట్లు ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.పండుగలు సామరస్యానికి ప్రతీకలని, సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు అందరూ కలిసిమెలిసి పండుగలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పోచారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఘట్కేసర్ మండల అధ్యక్షుడు కర్రే రాజేష్, స్థానిక నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .