శ్రీ పరాభవ ఉగాది.... వసంత శోభ

శ్రీ పరాభవ ఉగాది.... వసంత శోభ

 

   భారతీయ కాలగణనం మూడు విధాలుగా చేయగా సౌరమానం, చాంద్ర మానం, బార్హస్పత్యమానంగా, సౌరమానం సూర్యుని ఉదయాస్తమయ కాలాలను ఆధారంగా చేసుకుని నిర్ణయించేది. చంద్రుని ఉదయాస్తమయ కాలాలు, వృద్ధి క్షయాలు ఆధారంగా చేసే కాల నిర్ణయం చంద్రమానమైంది. బృహస్పతి (గురు) గ్రహం చలన ఆధారంగా చేసే గణనమే బార్హస్వత్యమానం. చాంద్రమానం ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమినాడు ఆ సంవత్సరంలో మొదటి దినం. యుగస్య ఆది: యుగాది. యుగం యొక్క ప్రారంభం అని దీని అర్థం. ఉగాది అంటే 'ఉ' అంటే నక్షత్రం 'గ' అంటే గమనం. నక్షత్ర గమనానికి 'ఆది' కనుక ఉగాదిగా పిలుస్తారు. సంవత్సరాది, యుగాది, ఉగాది, ఈరీతిగా అనేక పేర్లతో రూఢ్యమై అనేక సాంప్రదాయాల ద్వారా తెలుగువారికి కర్తవ్యాలను చక్కగా నిర్దేశించి చెప్పే తొలి పర్వదినం ఉగాది.

ఏ ఋతువైనా సుఖప్రదమైన, ఆనందదాయకమైనదే. మానవ జీవితము వివసితమై వసంతంలోని విశిష్టత ప్రకృతి విలాసంలో ప్రతిఫలిస్తుంది. ప్రకృతికాంత షడ్డునాలే ఆరు ఋతువులుగా ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క మనఃప్రవృత్తిని వికసింపచేసి, మానవ జీవితంలో కష్టసుఖాలు తాత్కాలికాలు అని సూచిస్తాయి. ఋతువులు ప్రాచీన కాలం నుండి మానవ జీవితంలో ఆనంద ఉత్సాహాలను పెంపొందిస్తున్నాయి. చైత్రశుద్ధ పాడ్యమినాడే నూతన సంవత్సరారంభమని మన పూర్వులు నిర్ణయించడానికి కారణం వసంత ఋతువులో ప్రకృతిలో నవచైతన్యం మోసులెత్తడమే. జ్యోతిష్య శాస్త్రవేత్త వరాహమిహిరుడు వసంతకాలంలోని చైత్రశుద్ధ పాడ్యమిగా నిర్ణయించడం అప్పటి నుండి చైత్ర శుద్ధ పాడ్యమినే 'ఉగాది'గా జరుపుకుంటున్నాము. ఇది శ్రీ పరాభవ నామ సంవత్సరం. పాదం మోపకముందే యుద్ధం మొదలైంది.

సృష్టికారకుడైన బ్రహ్మ, చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినమున సూర్యోదయ వేళ సమగ్రంగా ఈ జగత్తును సృజించడంతోపాటూ, కాలగమనంలో గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షవారాధిపులను ప్రవర్తింపజేసినట్లు 'చతుర్వర్గ' చింతామణి వ్రత ఖండం పేర్కొంది. వసంత శోభ రమణీయంగా ఉండి భౌతిక సుభమే కాకుండా, ఆధ్యాత్మిక సుఖం కూడా లభించే ఉగాది పర్వదినాన అందరూ ఉదయాన్నే స్నానమాచరించి, పిల్లలు, పెద్దలు, నూతన వస్త్రాలను ధరిస్తారు. తమ తమ ఇష్టదైవాన్ని పూజిస్తారు.

ఉగాదినాడు ప్రత్యేకంగా వేపపూత, మామిడి కాయముక్కలు, కొత్తబెల్లం, కొత్త చింతపండు, చెరుకు ముక్కలు, మిరియపు పొడి, ఉప్పు మొదలైన మిశ్రమంతో, 'ఉగాది' పచ్చడి తయారు చేస్తారు. తీపి చేదుతో వగరుతో కూడిన ఈ ఉగాది పచ్చడిని మానవ జీవితంలో ఉండే సుఖదుఃఖాలకు ప్రతీకగా చెబుతారు. మన భారతీయ సంప్రదాయంలో ప్రతి పండుగ వెనుక ఆధ్యాత్మికపరమైన విషయాలతో, ఔషధ పరమైన ఆయుర్వేద రహస్యాలెన్నో దాగివుంటాయి. ఉగాది పచ్చడిలో ఉండే తీపి, పులుపు, కారం, వగరు,ఉప్పుదనం, లేదు అనే ఆరు రుచులు ఔషధపరంగా ఆలోచిస్తే అది వ్యాధినిరోదక శక్తి వస్తుందని ఆయుర్వేదం తెలియజేస్తుంది.

వేదిచెట్టుగాలి ఆరోగ్యానికి అభప్రదం. అలాగే వేప చిగుర్లు కడుపులోని మలిపురుగుల్ని చంపేసి, తిరిగి పుట్టనీయవు. వేప ఆకును పసుపు, నూనెలో కలిపి ముద్ద చేసి ఒంటికి రాసుకుంటే చర్మవ్యాధులు నయమవుతాయి. కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది. కొత్త చింతపండు కఫవాతాన్ని పోగొట్టగా, కారాన్ని కలిగించే మిరియపు పొడి శరీరంలోని క్రిముల్ని నాశనం చేస్తుంది. మామిడి ముక్కలు లాలాజలాన్ని ఊరించి జీర్ణక్రియకి తోడ్పడుతుంది. ఉప్పు ఎముకలని బలపరుస్తుంది. ఈ ఆరు రుచులు ఆరు ఋతువుల్లో మనకి కలిగే ఆరు రకాల దీర్ఘకాలిక వ్యాధుల్ని తొలగిస్తాయి. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనమైన పచ్చడిని అందరూ ఆరగించడం పంచ భక్ష్యాదులతో భోజనం ఆరోగ్యప్రదం.

పంచాంగ శ్రవణం ఉగాది రోజున ప్రత్యేకతను సంతరించుకున్న అంశం.
తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగం. శ్రీశైల పంచాంగం. తెలంగాణలో చెన్నూరి పంచాంగం.. ఆంధ్రలో నేమాని పంచాంగం.. ఈ నాలుగు పంచాంగాలు పూర్వం ఉండేవి. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇవి పటిష్టమైన పంచాంగాలు. జ్యోతి శాస్త్రానికి భలిష్ఠమైనవి. ఈనాడు జిల్లాకో పంచాంగ కర్తలు కుక్క గొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన విషయం కాదు. తమ ఇష్టానుసారం పంచాంగాలు ప్రచూరించుకుంటున్నారు. ఇది ఒక వ్యాపారమైంది. ఉగాది పండుగ ఆరు నెలలకు ముందుగానే ఈ పంచాంగాలు విడుదల చేస్తున్నారు. జ్యోతి శాస్త్రము పై పట్టు లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. ఏది ఏమైనా శాస్త్రాన్ని వక్రదారి పట్టించరాదు. నిజాల్ని కప్పి పెట్టి రాజకీయ నాయకులకు అనుగుణంగా జాతకాలని చెప్పడం సరైన పద్ధతి కాదు శాస్త్రాన్ని నమ్మిన పంచాంగ కర్త నిజాన్ని నిక్కచ్చిగా చెప్పాలి. పూర్వపు పంచాంగ కర్తలను ఈనాటికీ మనం స్మరించుకోవడం శాస్త్రాన్ని విస్మరించకపోవడం. పంచాంగాల్లోని విషయాలను వక్రదారి పట్టించకుండా సరియైన మార్గము చూపేవారు. కనుక ప్రామాణికమైన పంచాంగాలను ఆదరిద్దాం.!

*ఈ సంవత్సరం పరాభవ మా ... వై/విభవమా*

             పంచాంగం భవిష్యత్తు గురించి సమాచారం అందించే గ్రంథం మాత్రమే కాదు, దీని వెనుక మతపరమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది శ్రీమహావిష్ణువు కాలపురుషుడిని గౌరవించేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు. భగవంతుని కాలాన్ని లేదా కాలపురుషుడిని ఆరాధించడం అంటే ఆయనకు నివాళులు అర్పించినట్లే. నిజానికి మన జీవితంలో సమయం యొక్క ప్రాముఖ్యతను పరిగణలోనికి తీసుకొని ప్రతిక్షణం చక్కగా జీవించాలి మన జీవితం ఎలా సాగుతుందో.. మనలో ఎవరికీ తెలియదు. ఆటుపోట్లు  తిరుగులేనిది.ఎవరి కోసం వేచి ఉండవు. జీవితం అనేది పరిమితంగా ఉంటుంది. జీవితంలో సమయం ఎప్పుడూ విలువైనదే మన జీవితాలపై సమయ ప్రభావం ఉంది మనం ఎప్పటికీ తప్పించుకోలేము.మనిషి ఏదైనా చెడు కర్మ చేస్తే అతను ఆ ఫలితాన్ని అనుభవించాలి. కర్మ ఫలితాలను శాంతింప చేయడానికి ఆచార,ఆరాధన, విధులు, బాధ్యతల పంపిణీ ఉత్తమ మార్గం.కాలాన్ని కర్మ ఫలితాలను ఇచ్చే దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పంచాంగ శ్రవణం మనిషికి తోడ్పడుతుంది.

*పంచాంగ శ్రవణం తిధిర్వారంచన నక్షత్రి యోగః కరనమేవచ !*

 పంచాంగ మితి విఖ్యాతాం లోకోయం కర్మసాధకః "అంటే తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములను ఐదు అంగములు కలది. కలిగినది పంచాంగం. ఈ ఐదు అంగాలతో కూడిన పంచాంగాన్ని ఉగాది రోజున వివిధ దేవతలతోపాటు పూజించాలనే శాస్త్ర వచనం కాగా పంచాంగ శ్రవణాన్ని చేస్తున్న సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చొని పంచాంగం వింటే శుభ ఫలితాల్సి పొందుతారని పండితుల అభిప్రాయం. ఆ సంవత్సరంలో జరుగబోయే వివిధ ఫలితాలను, లాభనష్టాలను, సంఘటనలు, వర్షాలు, ప్రమాదాలు, తదితర వాటిని పంచాంగకర్తలు అంచనా వేస్తారు.

పంచాంగ శ్రవణంచే తిథి వలన సంపదను ప్రసాదిస్తుంది. వారం ఆయుష్షును పెంపొందింపచేస్తుంది. నక్షత్రం పాపాలను తొలగిస్తే యోగం వ్యాధులను నయం చేస్తుంది. కరణం కార్యాలను సిద్ధింపచేస్తుంది. ఈ ఐదు అంగములను తెలుసుకోవడం వల్ల గంగానదిలో స్నానం చేసిన ఫలితం అభిస్తుందని తెలుస్తోంది.

పంచాంగ శ్రవణము చేసిన వారికి సూర్యుడు శౌర్యమును, చంద్రుడు, ఇంద్ర సమాన వైభవమును, కుజుడు, శుభమును, బుధుడు బుద్ధిని, గురువు గౌరవమును శుక్రుడు సుఖమును, శని ఐశ్వర్యమును, రాహువు. బాహుబలమును, కేతువు కులాధక్యమునుకలుగుతుందికనుక మానవ జన్మకు పరమ లక్ష్యమగు మోక్షప్రాప్తికి ఆధ్యాత్మిక జ్ఞానము అవసరముగాన సగుణ రూపములగు బ్రహ్మాండ, దేహ, దేవాలయాలకు ఏకత్వం సాధించి ఆధ్యాత్మిక జ్ఞానమును, బహిక, ఆముష్మిక భోగములను ముక్తిని పొందుటయే పంచాంగ జ్యోతిశ్శాస్త్ర ప్రయోజనముగా తెలియవలెను.

*"సర్వేభద్రాణి పశ్యస్తు సర్వేసన్తు నిరామయా సర్వే భవన్తు సుఖిన్ మాకశ్చిత్ దుఃఖబాశ్చివేత్" అంటే అందరికీ మేలు జరగాలని, రోగ రహితులు కావాలి, అందరూ సుఖంగా ఉండాలి. ఎవ్వరూ బాధపడకూడదు అని భావం*

*సర్వేజనా సుఖినోభవన్తు*

    *" ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్"*
*" ఆధ్యాత్మిక సాహితీ వ్యాస భూషణ్ "*
               *" సాహితీ శిరోమణి "*
                   *'' కావ్యసుధ "*  
                     9247313488
                     *హైదరాబాద్*

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం
జమ్మికుంట టౌన్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ నూతన పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో పట్టణంలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్...
గిరిజనలకు ఇచ్చిన హామీలను అమలుకై 25వేల కోట్లు కేటాయించాలి 
రంగాపూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు
గీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం -- చైర్మన్ సుహాసిని.
ఆపదలో అండగా పీఆర్టీయూ టిఎస్ ఉపాధ్యాయ సంఘం 
శ్రీ పరాభవ ఉగాది.... వసంత శోభ
తోవ