ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ నామ

ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ నామ

ఖమ్మం బ్యూరో, మార్చి 18(తెలంగాణ ముచ్చట్లు )

తెలుగు ప్రజల ముఖ్యమైన పండుగ ఉగాది సందర్భంగా బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సంతోషం కలగాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.  కొత్త సంవత్సరాన్ని సరికొత్త ఆశయాలు, లక్ష్యాలతో ప్రారంభించి విజయాలను సాధించాలని తెలిపారు. రాష్ట్రం మరియు దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని, రైతులు, కార్మికులు, విద్యార్థులు, వ్యాపారులు అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు. ఉగాది పండుగ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్న ఆయన, ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మనిషి జీవితంలోని సుఖదుఃఖలు, విజయాపజయాలను సూచిస్తాయని వివరించారు. ప్రతి పరిస్థితిని సమానంగా స్వీకరించే ధైర్యం, సహనం మనలో పెంపొందాలని తెలియజేశారు.  ఈ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబంలో ఆనందం, సౌభాగ్యం నెలకొనాలని, సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందాలని ఆకాంక్షించారు.  ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగి, సమాజ అభివృద్ధి దిశగా కృషి చేయాలని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .