వైభవంగా ‘ది గోల్డెన్ గాలా’ బ్యాంక్వెట్ హాల్ ప్రారంభం

ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

వైభవంగా ‘ది గోల్డెన్ గాలా’ బ్యాంక్వెట్ హాల్ ప్రారంభం

ఏ ఎస్ రావు నగర్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డ జి.ఆర్. రెడ్డి నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ది గోల్డెన్ గాలా – బ్యాంక్వెట్స్ & కేటరర్స్’ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆధునిక సదుపాయాలతో కూడిన బ్యాంక్వెట్ హాల్ అందుబాటులోకి రావడం శుభపరిణామమన్నారు.వివాహాలు, నిశ్చితార్థాలు, పుట్టినరోజు వేడుకలు వంటి శుభకార్యాలతో పాటు సామాజిక కార్యక్రమాలకు ఈ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.నాణ్యమైన ఆహారం, మెరుగైన సేవలతో ప్రజల విశ్వాసాన్ని పొందాలని నిర్వాహకులను కోరారు. ఇలాంటి సంస్థల ఏర్పాటు ప్రాంతీయ అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, స్వర్ణ రాజ్ శివమణి, బొజ్జ రాఘవ రెడ్డి, కాసం మహిపాల్ రెడ్డి, పాకాల రాజన్న, నవీన్ గౌడ్, మహేష్ గౌడ్, కుమార స్వామి, మణెమ్మ, రహీం అల్లురయ్య, కిరణ్, ఆనంద్ చారి, విజేందర్, రాజేష్, ప్రకాష్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.నిర్వాహకులు డి. త్రిష్ణక, డి. సందీప్, ఎస్. సాయి కుమార్, ఎస్. సంతోష్ కుమార్, డి. శశాంక ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.


IMG-20260318-WA0028

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం
జమ్మికుంట టౌన్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ నూతన పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో పట్టణంలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్...
గిరిజనలకు ఇచ్చిన హామీలను అమలుకై 25వేల కోట్లు కేటాయించాలి 
రంగాపూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు
గీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం -- చైర్మన్ సుహాసిని.
ఆపదలో అండగా పీఆర్టీయూ టిఎస్ ఉపాధ్యాయ సంఘం 
శ్రీ పరాభవ ఉగాది.... వసంత శోభ
తోవ