పామిరెడ్డిపల్లిలో స్మశాన వాటికకు నీటి వసతి కల్పించిన ఎమ్మెల్యే.. ముస్లిం సోదరుల కృతజ్ఞతలు
Views: 19
On
పెద్దమందడి,మార్చి18(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని స్మశాన వాటికలో ముస్లిం సోదరుల అవసరాల కోసం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తన సొంత నిధులతో బోర్‌వెల్ ఏర్పాటు చేయించారు. నీరు పుష్కలంగా లభించడంతో గ్రామంలో నీటి సమస్యకు పరిష్కారం లభించింది.సమస్యను తెలియజేసిన వెంటనే స్పందించి నీటి వసతి కల్పించడం పట్ల ముస్లిం సోదరులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదుపాయం ద్వారా స్మశాన వాటికలో అవసరమైన సమయంలో నీరు అందుబాటులో ఉండేలా మారిందని గ్రామస్థులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మదిర మంజుల శ్రీశైలం, ఉప సర్పంచ్ రాములమ్మ హనుమంతు, మాజీ ఎంపీటీసీ ఇంద్రలక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్‌లు సిద్దన్న, తిక్కన్న, శౌఖత్‌తో పాటు ముస్లిం సోదరులు హనాన్, ఖయ్యూం, సమీ, సాదిక్, మైబ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments