విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం

మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ 

విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం

జమ్మికుంట టౌన్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మున్సిపల్ నూతన పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో పట్టణంలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల పని వేళలు, సమస్యలు, అవసరమైన సౌకర్యాలపై చర్చించారు.
చైర్మన్ మాట్లాడుతూ పట్టణంలో పెరుగుతున్న జనాభాతో ప్రతి వార్డులో పనిభారం అధికమవుతోందని తెలిపారు. అయినప్పటికీ పారిశుద్య కార్మికులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ టీమ్ వర్క్‌తో ముందుకు సాగాలని సూచించారు. అలాగే తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవాలని సూచించారు.
శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న వారిలో ఉన్నత చదువులు చదివిన వారిని గుర్తించి, వారి అర్హతలకు అనుగుణంగా అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్‌లను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు శీలం శ్రీనివాస్, చందా రాజు, చింతల శ్రీనివాస్, అజయ్ రావు, దిడ్డి రాము, శానిటరీ ఇన్స్పెక్టర్మహేష్, సదానందం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. IMG-20260318-WA0074

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .