అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ, పేదలకు ఆర్థిక సహాయం

అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ, పేదలకు ఆర్థిక సహాయం

కుషాయిగూడ, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):

వాసవి మిత్రమండలి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ సమీపంలోని సాయిబాబా మందిరంలో ప్రతి అమావాస్య సందర్భంగా నిర్వహించే అన్నప్రసాద వితరణ కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.అనంతరం పేద వృద్ధ మహిళలు మాలే వరమ్మ, కొండూరి విజయ, తోడుపునూరి ఉమారాణి, పడకంటి కమలమ్మలకు ప్రతినెల అందించే పింఛన్‌లో భాగంగా ఈ నెలకు గాను ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున మొత్తం నలుగురికి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వాసవి మిత్రమండలి అధ్యక్షులు పెద్ది నాగరాజు గుప్త, ప్రధాన కార్యదర్శి రెబెల్లి శ్రీనివాస్ గుప్త, కోశాధికారి రాముని తిరుమలేష్ గుప్త, కార్యనిర్వాహక కార్యదర్శి గంప కృష్ణ గుప్త పాల్గొన్నారు.ఉపాధ్యక్షులు నంగునూరి అశోక్ గుప్త, వైవీయూ నాగేశ్వర్ రావు గుప్త, తాటి శ్రీనివాస్ గుప్త, కార్యదర్శులు బాచెల్లి నవీన్ గుప్త, అమర కృష్ణ గుప్త, చందా సంతోష్ గుప్త, బల్లి శ్రీధర్ గుప్త తదితరులు హాజరయ్యారు.కార్యవర్గ సభ్యులు మిర్యాల అరుణ్ కుమార్ గుప్తతో పాటు సభ్యులు ఉప్పల శ్రీనివాసులు గుప్త, బెల్దే భగవాన్ గుప్త, చంద్రగిరి తారకేశ్వర్ గుప్త, పెద్ది నవీన్ గుప్త, నీలా శివకుమార్ గుప్త, అర్థం శ్రీనివాస్ గుప్త, బుస్సా శ్రీనివాస్ గుప్త, కూర రామ్మోహన్ గుప్త, కొందూరి లక్ష్మణ్ రావు గుప్త, రవ్వ ఈశ్వరరావు గుప్త, వీబీవీ కృష్ణ గుప్త, పెద్ది శ్రీనివాస్ గుప్త తదితరులు పాల్గొన్నారు.IMG-20260318-WA0024

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .