కీసరగుట్టలో ఘనంగా భవాని రామలింగేశ్వర స్వామి పల్లకి సేవ

కీసరగుట్టలో ఘనంగా భవాని రామలింగేశ్వర స్వామి పల్లకి సేవ

కీసరగుట్ట, మార్చి 19 (తెలంగాణ ముచ్చట్లు): 

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కీసరగుట్టలోని ప్రసిద్ధ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉగాది సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి సంప్రదాయబద్ధంగా పల్లకి సేవ నిర్వహించారు.పుష్పాలతో అలంకరించిన పల్లకిలో స్వామివారిని ఆశీనులను చేసి, వేదమంత్రాల నడుమ మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు.
ఈ పల్లకి సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం తెలంగాణలో ప్రముఖ శివక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .