మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ

మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ

ఎల్కతుర్తి, మార్చి 19: (తెలంగాణ ముచ్చట్లు) 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించిన త్రైత సిద్ధాంత యుగాది తెలుగు క్యాలెండర్‌ను హుస్నాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రబోధ సేవా సమితి ఎల్కతుర్తి శాఖ మండల అధ్యక్షుడు, ఆలయ అర్చకుడు సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ, శ్రీ పరాభవ నామ సంవత్సరంతో త్రైత శకము 48వ సంవత్సరంలోకి ప్రవేశించిందని తెలిపారు. శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు 1978లో ప్రబోధాశ్రమాన్ని స్థాపించి త్రైత శకానికి నాంది పలికారని వివరించారు.
త్రైత సిద్ధాంతం పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అనే మూడు ఆత్మలపై ఆధారపడిన ప్రత్యేక తత్వమని, ఇది అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైత సిద్ధాంతాలకు భిన్నమని చెప్పారు. యోగీశ్వరులు రచించిన “త్రైత సిద్ధాంత భగవద్గీత”తో పాటు అనేక దైవగ్రంథాలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సమాజానికి అందిస్తున్నాయని పేర్కొన్నారు.
తెలుగు భాషను దైవ భాషగా ప్రచారం చేస్తూ, దాని గొప్పతనాన్ని చాటేందుకు యోగీశ్వరులు విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన రచనలు, సేవలను గుర్తిస్తూ ప్రబోధాశ్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేసి సత్కరించారని వెల్లడించారు.
యుగాది పండుగ విశిష్టతను వివరించిన యోగీశ్వరులు, ప్రకృతి మార్పులు, గ్రహాల ప్రభావం మనిషి జీవితంపై ఉండే ప్రభావాన్ని తెలియజేశారని, ప్రతి ఒక్కరూ తెలుగు మాసాలు, తిథులతో కూడిన కాలసూచికను అనుసరించాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సరళమైన తెలుగు భాషలో రూపొందించిన ఈ క్యాలెండర్ ప్రతి ఒక్కరికీ ఉపయోగకరంగా ఉంటుందని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలిగేటి ఇంద్రసేన రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినే సంతాజీ, పీసీసీ సభ్యుడు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, బావుపేట సర్పంచ్ బత్తిని రవీందర్ గౌడ్, డాక్టర్ బొల్లెపోగు రమేష్ బాబు, మండ సుమన్ గౌడ్, అంబాల శ్రీకాంత్, మార్కెట్ డైరెక్టర్లు బచ్చు బాపు రావు, గోడిశాల రాజయ్య, బండి సుధాకర్, ముష్కే శ్రీనివాస్, పెండ్యాల భాస్కర్ తదితరులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆటపాటలతో కళకళలాడిన కొత్తపల్లి బోనాలు ఆటపాటలతో కళకళలాడిన కొత్తపల్లి బోనాలు
హుజురాబాద్, మార్చి 19: (తెలంగాణ ముచ్చట్లు)  హుజురాబాద్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పోచమ్మ బోనాలు ఉత్సవం ఆటపాటల నడుమ ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారిని...
జీవిత పోరాటంలో ఓడిపోయిన యువకుడు
మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ
కాప్రా డీసికి మొరపెట్టుకున్నా స్పందన లేదని ప్రజలు ఆవేదన
కుషాయిగూడలో మహిళ అదృశ్యం
కీసరగుట్టలో ఘనంగా భవాని రామలింగేశ్వర స్వామి పల్లకి సేవ
విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం