ప్రభుత్వ పాఠశాలలో సేవా కార్యక్రమాలతో కాష్యపి రెడ్డి జన్మదిన వేడుకలు

ప్రభుత్వ పాఠశాలలో సేవా కార్యక్రమాలతో కాష్యపి రెడ్డి జన్మదిన వేడుకలు

ఏ ఎస్ రావు నగర్, మార్చ్ 20 (తెలంగాణ ముచ్చట్లు):

జై జవాన్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో (ఎంపీపీఎస్) విద్యార్థుల మధ్య పజ్జురి కాష్యపి రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. డివిజన్ మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సేవా కార్యక్రమాలతో ప్రత్యేకంగా నిలిచింది.ఈ సందర్భంగా పీఎంఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా నీటి సీసాలను పంపిణీ చేశారు. పావని మణిపాల్ రెడ్డి తన కుమార్తె కాష్యపి రెడ్డితో కలిసి విద్యార్థులకు సీసాలను అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన పావని మణిపాల్ రెడ్డి, తన కుమార్తె పుట్టినరోజును ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడడం తమ లక్ష్యమని తెలిపారు.పీఎంఆర్ ప్రతినిధులు మాట్లాడుతూ, దివంగత నేత కీ.శే. పజ్జురి మణిపాల్ రెడ్డి పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీఎంఆర్ సభ్యులు, స్థానిక నాయకులు, మహిళలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు కాష్యపి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పాఠశాల అభివృద్ధికి పజ్జురి కుటుంబం అందిస్తున్న సహకారం అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.IMG-20260320-WA0013

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .