వనపర్తి జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఐ. సత్య రెడ్డి నియామకం

వనపర్తి జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఐ. సత్య రెడ్డి నియామకం

వనపర్తి,మార్చి20(తెలంగాణ ముచ్చట్లు):

 తెలుగు సంవత్సర శ్రీ పరాభవ నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీని టీపీసీసీ ఉపాధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వుల ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఐ. సత్య రెడ్డిని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించారు.ఈ నియామకంపై జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి ఐ. సత్య రెడ్డి నాయకత్వం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఐ. సత్య రెడ్డి మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి కార్యకర్తకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు.తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు టీపీసీసీ ఉపాధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త కాపు శివసేనారెడ్డికి, వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు తూడి మెగా రెడ్డికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .