హెచ్ఎంటి నగర్ చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం…
ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
నాచారం, మార్చి 20 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు అభివృద్ధి పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చిత్రపటానికి స్థానిక నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో చెరువు కట్టపై జరిగిన ఈ కార్యక్రమంలో బారాసా నాయకులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఇచ్చిన హామీ ప్రకారం చెరువు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పల్ నల్లచెరువు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణం కొనసాగుతున్నందున ప్రస్తుతం నీటిని పూర్తిగా విడుదల చేయలేకపోతున్నామని, పనులు పూర్తయిన వెంటనే గేట్లు తెరిచి పెద్ద మొత్తంలో నీటిని ఖాళీ చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించినట్లు తెలిపారు.అలాగే త్వరలోనే పటేల్ కుంట చెరువు సుందరీకరణ పనులు కూడా చేపడతామని, అప్పటివరకు చెరువులోని మురుగు, చెత్త తొలగింపు పనులను తక్షణమే ప్రారంభిస్తామని మాజీ కార్పొరేటర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సాయిజెన్ శేఖర్, మేడల మల్లికార్జున గౌడ్, విట్టల్ యాదవ్, కట్ట బుచ్చన్న గౌడ్, మారయ్య, మక్తల శేఖర్ గౌడ్, యాదగిరి, చంద్రశేఖర్, సుగుణాకర్ రావు, జయరాజ్, వాసు, ఈశ్వర్, నరసింహ, రాజేష్ గౌడ్, వెంకటరెడ్డి, వీరాంజనేయులు, రోహిత్, జహీర్, కిరణ్, స్వామి, ఫారూఖ్, ముదసిర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.


Comments