చిన్నగుంటపల్లెలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు
విజేతలకు బహుమతుల ప్రదానం
వనపర్తి,మార్చి20(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి మండలం చిన్నగుంటపల్లె గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకుని స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది.టోర్నమెంట్ చివరి రోజు జరిగిన బహుమతుల ప్రదానోత్సవానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా టోర్నమెంట్ విజేతగా ని
లిచిన మణిగిల్ల జట్టుకు రూ.40,000 నగదు బహుమతి మరియు షీల్డ్‌ను చిన్నారెడ్డి అందజేశారు.రన్నరప్‌గా నిలిచిన చిన్నగుంటపల్లె జట్టుకు రూ.25,000 నగదు బహుమతి మరియు షీల్డ్‌ను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ, క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉందని తెలిపారు.భారత మహిళా, పురుష క్రికెట్ జట్లు ప్రపంచస్థాయిలో విజేతలుగా నిలవడం గర్వకారణమని అన్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నదని పేర్కొన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒలింపిక్స్ క్రీడలను రాష్ట్రంలో నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ నిర్వహిస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని అన్నారు.క్రీడాకారులు స్నేహభావంతో ఆడుతూ క్రీడాస్ఫూర్తిని చాటాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేన రెడ్డి వనపర్తి నియోజకవర్గానికి స్పోర్ట్స్ స్కూల్ తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.వివేకానంద యూత్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, జిల్లా ఏఐపిసి అధ్యక్షుడు నాగార్జున, కిసాన్ సెల్ అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, వైస్ ఎంపీపీ సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.క్రీడా స్పూర్తి, గ్రామీణ ప్రతిభను వెలికి తేవడంలో ఇలాంటి టోర్నమెంట్‌లు కీలకమని పలువురు అభిప్రాయపడ్డారు.


Comments