మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు 

శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 

మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు 

వనపర్తి,మార్చి21(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి పట్టణంలో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గోపాల్పేట రోడ్డులోని ఈద్గా వద్ద ముస్లిం సహోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.రంజాన్ పండుగ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి  ఈద్గా వద్దకు చేరుకుని ముస్లిం సహోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు.రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారని, పండుగ రోజున ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని అన్నారు.కులమతాలకు అతీతంగా అందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఐక్యతకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పీసీసీ సభ్యుడు శంకర్ ప్రసాద్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, ఖిల్లా ఘణపురం మండల నాయకుడు సాయి చరణ్ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు ఆదిత్య, వనపర్తి పట్టణ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .