ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు

– ముస్లిం సోదరులతో కలసి వేడుకల్లో పాల్గొన్న మాజీ మేయర్ బొంతు రాంమోహన్

– బాజీ బాషా నివాసంలో పండుగ శుభాకాంక్షలుj

చర్లపల్లి, మార్చి 21 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గంలో రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించిన ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజులు నిర్వహించి ఆనందంగా పండుగ జరుపుకున్నారు.ఈ సందర్భంగా మాజీ మేయర్ బొంతు రాంమోహన్ ముస్లిం సోదరుల ఇళ్లకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాజీ బాషా నివాసాన్ని సందర్శించిన ఆయన, స్థానికులతో కలసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.రంజాన్ పండుగ క్రమశిక్షణ, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే సామాజిక ఐక్యతకు ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి యాదవ్, పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి పాల్గొన్నారు. బాజీ బాషా కుటుంబ సభ్యులు మరియు స్థానికులు నేతలను సాదరంగా ఆహ్వానించి సత్కరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .