యువత ఐఏఎస్, ఐపీఎస్ సాధనపై దృష్టి పెట్టాలి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్‌లో సివిల్ సర్వీసెస్ అవగాహన సదస్సు 

యువత ఐఏఎస్, ఐపీఎస్ సాధనపై దృష్టి పెట్టాలి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, మార్చి 21 (తెలంగాణ ముచ్చట్లు)

యువత ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సర్వీసులను సాధించడం లక్ష్యంగా పెట్టుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సూచించారు. సివిల్ సర్వీసుల ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం లభించడంతో పాటు సమాజంలో గౌరవం, ఉన్నత స్థానం పొందవచ్చని ఆయన అన్నారు.బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిగ్నేచర్ ఐఏఎస్ అకాడెమీతో కలిసి మార్చి 22 (ఆదివారం) సివిల్ సర్వీసెస్ పై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సు పోస్టర్‌ను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, భారాసా నాయకులు సాయిజెన్ శేఖర్, సిగ్నేచర్ ఐఏఎస్ అకాడెమీ డైరెక్టర్ ఆర్.ఎస్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ, బిఎల్ఆర్ ట్రస్ట్ గతంలో గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ అందించి అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా సహకరించిందన్నారు. అలాగే నీట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఐదు సంవత్సరాలపాటు ఉచిత విద్యను అందిస్తూ డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.సిగ్నేచర్ ఐఏఎస్ అకాడెమీ డైరెక్టర్ ఆర్.ఎస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ అవగాహన సదస్సు ఉప్పల్‌లోని అకాడెమీ ప్రాంగణంలో ఆదివారం ఉదయం 11 గంటలకు జరుగుతుందని తెలిపారు. పాల్గొనదలిచిన విద్యార్థులు 8639882839 నంబర్‌కు మెస్సేజ్ చేసి ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సమైక్యతా సౌరభం.. రంజాన్ సంబరం! సమైక్యతా సౌరభం.. రంజాన్ సంబరం!
ఖమ్మం బ్యూరో, మార్చి 21(తెలంగాణ ముచ్చట్లు) భారతీయ జీవన స్రవంతిలో అంతర్భాగమైన గంగా-జమునా తెహజీబ్‌కు నిలువుటద్దంగా, మత సామరస్యానికి మకుటాయమానంగా రంజాన్ పర్వదిన వేడుకలు శనివారం జిల్లా...
విద్యారంగానికి కేవలం 8.2% కేటాయింపు తీవ్ర అన్యాయం 
వనపర్తిలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లెల్ల ఆదిత్య రెడ్డి
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు 
విద్యకు న్యాయం చేయాలంటూ ఎస్ఎఫ్ఐ హెచ్చరిక
మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి