గ్రామాలకు అభివృద్ధి  నిధుల మంజూరు- ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ 

గ్రామాలకు అభివృద్ధి  నిధుల మంజూరు- ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ 

భీమదేవరపల్లి,మార్చి21( తెలంగాణ ముచ్చట్లు)

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి
బండి సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలసి కొత్తకొండ గ్రామ అభివృద్ధి పనులకు సహకారం అందించినందుకు కొత్తకొండ గ్రామ సర్పంచ్, గ్రామ పాలకవర్గం కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమం భీమదేవరపల్లి మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ మరియు జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కొత్తకొండ గ్రామ సర్పంచ్ రమ రమేష్, రంగయ్యపల్లి సర్పంచ్ మండల రజిని మహేష్, రసూల్ పల్లి గ్రామ సర్పంచ్ బోయిని మహేష్ మరియు గ్రామ సర్పంచులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్  కొత్తకొండ గ్రామానికి ఈ మధ్యకాలం లో.5 హై మాస్ట్ లైట్లు. 2 బోర్లు. 15 లక్షల రూపాయల సీసీ రోడ్లు. చేయించగా, అదనంగా మే నెల బడ్జెట్‌లో మరో 10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రసూల్ పల్లి మరియు రంగయ్యపల్లి గ్రామాలకు కూడా 15 లక్షల రూపాయల సీసీ రోడ్ల ఈ నెలలో వేసుకునేటట్లు సదుపాయం కల్పిస్తా అని తెలిపారు. మిగతా అభివృద్ధి పనులకు కూడా మే నెలలో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజల అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తున్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ను గ్రామ సర్పంచులు మరియు పాలకవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .