కీసరలో ఘనంగా సిఎంఆర్ కబడ్డీ చాంపియన్‌షిప్

కీసరలో ఘనంగా సిఎంఆర్ కబడ్డీ చాంపియన్‌షిప్

_గోల్డెన్ జూబ్లీ సందర్భంగా క్రీడా వేడుకలు

_యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించాలన్న నిర్వాహకులు

కీసర, మార్చి 21 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ జిల్లా కీసరలో చామకూర కల్పన–మల్లారెడ్డి దంపతుల 50వ వివాహ వార్షికోత్సవం (గోల్డెన్ జూబ్లీ)ను పురస్కరించుకొని సిఎంఆర్ కబడ్డీ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ ఎస్‌సి కాలనీలో రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీలు క్రీడాభిమానులను ఆకట్టుకున్నాయి.కీసర డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో పలు ప్రాంతాల నుంచి జట్లు పాల్గొని ఉత్కంఠభరితంగా తలపడ్డాయి. యువత పెద్ద ఎత్తున పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటారు.విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి రూ.50,000, రెండవ బహుమతి రూ.25,000, మూడవ బహుమతి రూ.10,000, నాలుగవ బహుమతి రూ.10,000 ప్రకటించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం, భారతదేశ కబడ్డీ సంఘం వైస్ ప్రెసిడెంట్ కాసాని వీరేష్ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం జనరల్ సెక్రటరీ, అంతర్జాతీయ క్రీడాకారుడు మద్ది మహేందర్ రెడ్డి హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో రామారం సుజాత, శీలం మల్లేష్, చినింగని బాలరాజ్, మెట్టు పరమేష్ యాదవ్, వెంకట్ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, తుడుం శ్రీనివాస్, బొడుసు రమేష్ యాదవ్, సుమన్ బన్నీ, గోరంటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యవంతమైన జీవనశైలి పెంపొందుతుందని తెలిపారు.IMG-20260321-WA0086

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .