ఆచారం పేరిట ఆకలి శిక్ష....

ఆచారం పేరిట ఆకలి శిక్ష....

IMG-20260321-WA0093పాలు కల్తీ చేసి 
పసిపిల్లల ఊపిరి ఆపిన వాడితో 
నీకు సమస్య లేదు.

వేలకోట్లు దోచుకుని వంతెనల్ని వంచించి
ప్రజల్ని పాతిపెట్టిన వాడి మీద నీకు కోపం రాదు.
దేశాన్ని దోచి దాచుకున్న దొంగల ముందర
నీ ధర్మం దండం పెడుతుంది.

కానీ
పేదవాడి గంజిలో ఒక గుడ్డు పడితే
నీ నీతి నిప్పులే కక్కుతుంది
నీ ఆచారం అగ్నిలా ఎగసిపడుతుంది.

ఎందుకంటే నీకు భయం 
పేదరికం రుచి చూసిన గొంతు
ఒక్కసారి లేస్తే నువ్వు కట్టుకున్న కోటలు
మట్టిపాలు అవుతాయని నీకు తెలుసు
అది నీ అబద్ధాల గొంతు నొక్కే  ప్రశ్న అని నీకు తెలుసు.

దేవుళ్లకు నైవేద్యం పెడ్తావు
పిల్లల కడుపుకి మాత్రం నియమాలు పెడ్తావు,
పుణ్యభూమి అంటావు
పిల్లల ప్రాణాలు పణంగా పెడ్తావు

దేవుళ్లు పుట్టిన నేల అని చెప్పుకునే ముందు
మనుషులు బ్రతికేలా చూసుకో
లేకపోతే నీ చరిత్ర గొప్పదైనా
ఆకలి కేకల మధ్య నీ నాగరికత 
శవపేటికలో కూలిపోతుంది.

గుర్తుపెట్టుకో
ఖాళీ కడుపుతో కూర్చున్న ప్రతి పిల్లవాడు
ఈ వ్యవస్థ దాచుకున్న ఆకలి ప్రశ్నల అగ్నిపర్వతం.


~ బసడ సంపత్ యాదవ్ ✍🏻 
  7032132593

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .