ఉప్పల్‌లో కరాటే సమ్మర్ క్యాంప్ ప్రారంభం

ఉప్పల్‌లో కరాటే సమ్మర్ క్యాంప్ ప్రారంభం

_చిన్నారుల సమగ్రాభివృద్ధికి క్రీడలు అవసరం

 – పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్, మార్చి 29  (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ బాగాయత్‌లోని బజాజ్ షోరూమ్ సమీపంలో సెమ్సీ రామ్ ఫణేంద్ర కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరాటే సమ్మర్ క్యాంప్‌ను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి చిన్నారులే భావి భారతానికి భవిష్యత్తు అని, వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలే దేశానికి నిజమైన సంపద అని అన్నారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ కనబరచాలని సూచించారు.గత 20 సంవత్సరాలుగా కరాటే మాస్టర్ రామ్ ఫణేంద్ర పిల్లలకు శిక్షణ ఇస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారని, ఆయన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కరాటే వంటి శిక్షణలు పిల్లల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, ధైర్యాన్ని పెంచుతాయని తెలిపారు.వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్‌లో పాల్గొని మానసిక, శారీరకంగా దృఢంగా మారాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాశికంటి నాగరాజు, సల్ల ప్రభాకర్, ఈగ సంతోష్, పూజల ప్రభాకర్, బోడిగా ప్రభాకర్ గౌడ్, మంద మురళీకృష్ణ రెడ్డి, గిరిదాస్ వెంకటేష్, శివ తదితరులు, కరాటే విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News