బడ్జెట్‌లో బీసీలకు ‘మొండిచేయి’.. ఈసీఐఎల్ చౌరస్తాలో టీఆర్‌పీ ధర్నా

బడ్జెట్‌లో బీసీలకు ‘మొండిచేయి’.. ఈసీఐఎల్ చౌరస్తాలో టీఆర్‌పీ ధర్నా

కాప్రా, మార్చి 23 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌పై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో బీసీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించలేదని ఆరోపిస్తూ సోమవారం కాప్రా సర్కిల్ పరిధిలోని ఈసీఐఎల్ చౌరస్తాలో భారీ ధర్నా నిర్వహించారు.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు పనగట్ల చక్రపాణి గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో చౌరస్తాను హోరెత్తించారు.ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ‘కామారెడ్డి డిక్లరేషన్’ హామీలను బడ్జెట్‌లో పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. బీసీ సంక్షేమానికి సంవత్సరానికి రూ. 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం, బడ్జెట్‌లో ఆ అంశాన్ని ప్రస్తావించకపోవడం బీసీలను వంచించడమేనని విమర్శించారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీపై ప్రభుత్వం మౌనం వహించడం దురదృష్టకరమన్నారు.జిల్లా అధ్యక్షుడు పనగట్ల చక్రపాణి గౌడ్ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ. 2,500 అందించే మహాలక్ష్మి పథకం, నిరుద్యోగ భృతి వంటి హామీలకు తగిన నిధులు కేటాయించకపోవడం ప్రభుత్వ వైఫల్యమని పేర్కొన్నారు.జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సింగం అరుణ్ పటేల్ మాట్లాడుతూ, ప్రభుత్వం తన మొండి వైఖరిని విడిచి సవరించిన బడ్జెట్‌లో బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, యువత, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20260323-WA0065

Tags:

Post Your Comments

Comments

Latest News