మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన కందికట్ల పద్మ

మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన కందికట్ల పద్మ

జమ్మికుంట టౌన్, మార్చ్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన పద్మశాలి 2026 ఉగాది పురస్కార కార్యక్రమంలో జమ్మికుంట మండలం ధర్మారం గ్రామానికి చెందిన కందికట్ల పద్మ గారికి సేవా అవార్డు ప్రదానం చేయడం విశేషంగా నిలిచింది. ఈ పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ చేతుల మీదుగా అందుకోవడం ఆమె సేవలకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చింది.
సమాజ సేవ పట్ల అంకితభావంతో పనిచేస్తున్న కందికట్ల పద్మ, మహిళల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. మహిళలకు టైలరింగ్ శిక్షణ అందించడం, కాటన్ బ్యాగుల తయారీపై ప్రోత్సాహం కల్పించడం, స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించడం ద్వారా అనేక కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పడుతున్నారు.
ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ ఉగాది పురస్కారం లభించడం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు, నాయకులు పద్మ సేవలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు.
జమ్మికుంట ప్రాంతానికి చెందిన వ్యక్తిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం స్థానికంగా గర్వకారణంగా మారింది

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .