అమరవీరుల సంస్మరణ సభ నిర్వహణ

భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల సంస్మరణ సభ 

అమరవీరుల సంస్మరణ సభ నిర్వహణ

ఏ ఎస్ రావు నగర్, మార్చి 23 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో సోమవారం కమలానగర్ కార్యాలయంలో అమరవీరులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారత స్వాతంత్ర పోరాటంలో వీరమరణం పొందిన వీరులకు 95 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేశారు.స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ, ప్రముఖ కవి-రచయిత బంగారు ఆచార్యులు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల త్యాగం భారత స్వాతంత్ర్య పోరాటానికి దిశానిర్దేశం చేసిందన్నారు. భగత్ సింగ్ చిన్న వయస్సులోనే విప్లవ భావజాలాన్ని అలవరచుకుని, సమాజంలో చైతన్యం కలిగించేందుకు కృషి చేశారని పేర్కొన్నారు.జలియన్‌వాలాబాగ్ ఘటన, లాలా లజపతిరాయ్‌పై జరిగిన లాఠీచార్జ్ వంటి సంఘటనలు ఆయనను ఉద్యమ పంథాలో నడిపించాయని వక్తలు తెలిపారు. అమరవీరుల పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.జయరాజు ముగ్గురు యోధుల జీవిత విశేషాలను వివరించగా, నవతెలంగాణ రవి వీరులపై పాట పాడి సభను ఉత్తేజపరిచారు. గగన్ కుమార్, శారద, ఎం. భాస్కర్ రావు తదితరులు ప్రసంగించారు.అనంతరం సభ్యులు అమరవీరుల చిత్రపటాలకు పూలు సమర్పించి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎన్. శ్రీనివాస్, శోభ, లక్ష్మయ్య, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News