కమలాబాయి నగర్‌లో మౌలిక వసతుల కోసం బస్తీ వాసుల వినతిపత్రం
_డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై ఆవేదన
– త్వరలో అభివృద్ధి పనులు చేపడతామని సాయిజన్ శేఖర్ హామీ
నాచారం, మార్చి 29 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ పరిధిలోని కమలాబాయి నగర్‌లో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక బస్తీ వాసులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సాయిజన్ శేఖర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, రోడ్లు దెబ్బతినడం వల్ల ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని వారు తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకుని ప్రాథమిక వసతులు కల్పించాలని కోరారు.దీనిపై స్పందించిన సాయిజన్ శేఖర్ మాట్లాడుతూ, గతంలో కమలాబాయి నగర్ మల్లాపూర్ డివిజన్ పరిధిలో ఉండటం వల్ల అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామని పేర్కొన్నారు. ప్రస్తుతం నాచారం డివిజన్‌లోకి రావడంతో ఎమ్మెల్యే సహకారంతో డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో యూనుస్, కాసిం, యాదన్న, ఎండి హుస్సేన్, బొజ్జ కన్నా, అబ్రార్, గౌస్ భాయ్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.


Comments