గద్దర్ అవార్డు అందుకున్న మహా మనిషి డా. ఏఎస్ రావు డాక్యుమెంటరీ

గద్దర్ అవార్డు అందుకున్న మహా మనిషి డా. ఏఎస్ రావు డాక్యుమెంటరీ

_డా. ఏఎస్ రావు విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఘన సన్మాన సభ 

_ప్రముఖుల ప్రశంసలు

 ఏఎస్ రావు నగర్, మార్చి 29(తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ డా. ఏఎస్ రావు విజ్ఞాన వేదిక నిర్మించిన “మహా మనిషి డాక్టర్ ఏఎస్ రావు” డాక్యుమెంటరీ చిత్రానికి గద్దర్ అవార్డు లభించిన సందర్భంగా శనివారం రాత్రి స్థానిక హోమీ జే బాబా ఫంక్షన్ హాల్‌లో ఘన కార్యక్రమం నిర్వహించారు.సభకు ముందు డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు.దాశరధి థియేటర్స్ ఉపాధ్యక్షులు, టీపీఎస్‌కే అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు ఆకర్షణీయంగా ఆహ్వాన ప్రసంగం చేసి అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. ముఖ్య అతిథి ఈశ్వరయ్య డాక్టర్ ఏఎస్ రావు చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విజ్ఞాన వేదిక అధ్యక్షులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ, డాక్యుమెంటరీ నిర్మాణం ఇదే వేదికలో నిర్ణయించి, అందరి సహకారంతో తక్కువ కాలంలో పూర్తి చేసి పలు అవార్డులు సాధించడం గర్వకారణమన్నారు. ప్రధాన కార్యదర్శి పి.బి. చారి నివేదికను సమర్పిస్తూ, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడమే వేదిక లక్ష్యమని తెలిపారు.డాక్యు మెంటరీ దర్శకుడు రఘురామచంద్ర, బీడీఎల్ సత్యనారాయణల కృషిని అభినందిస్తూ, నటీనటులు, సాంకేతిక బృందం సహకారంతో చిత్రం విజయవంతమైందన్నారు.
ముఖ్య అతిథి ఈశ్వరయ్య మాట్లాడుతూ, డాక్టర్ ఏఎస్ రావు చేసిన త్యాగాలు, దేశాభివృద్ధికి ఆయన చూపిన మార్గం ఈ చిత్రం ద్వారా స్పష్టమైందని అన్నారు. ఈ చిత్రాన్ని విద్యార్థులు, ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని కోరారు.మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు మాట్లాడుతూ, ఈ ప్రాంత అభివృద్ధికి డాక్టర్ ఏఎస్ రావు చేసిన సేవలు అపారమని కొనియాడారు. దాశరధి థియేటర్స్ అధ్యక్షులు ఎస్. వినయ్ కుమార్ డాక్యుమెంటరీ నిర్మాణంలో భాగస్వాములైన వారిని అభినందించారు. డాక్టర్ ఏఎస్ రావు సన్నిహితుడు ప్రేమ్ చంద్ తన అనుభవాలను పంచుకున్నారు.అనంతరం చిత్రంలో పాల్గొన్న నటీనటులు, సాంకేతిక సిబ్బందిని అతిథులు మెమొంటోలు, చేనేత వస్త్రాలతో సత్కరించారు. కార్యక్రమంలోవిజ్ఞాన వేదిక సభ్యులు, స్థానికులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. IMG-20260329-WA0069

Tags:

Post Your Comments

Comments

Latest News