మార్నింగ్ వాక్‌లో ప్రజా సమస్యలపై దృష్టి 

మౌలిక వసతుల అభివృద్ధికి సర్పంచ్ హామీ

మార్నింగ్ వాక్‌లో ప్రజా సమస్యలపై దృష్టి 

పెద్దమందడి,మార్చి27(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో  మార్నింగ్ వాక్ సందర్భంగా గ్రామ నూతన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో 3వ వార్డును సందర్శించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు.అండర్ డ్రైనేజీ మోరి పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.అలాగే పెద్ద కాలువపై పైపులు ఏర్పాటు చేసి రైతులు చేనులకు సులభంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ నీటి సరఫరాపై ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.వార్డులో తక్కువ వోల్టేజ్ సమస్యను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ పనులను త్వరలోనే ప్రారంభించడమే కాకుండా బోయిని చంద్రయ్య, వడ్ల కృష్ణయ్య ఇళ్ల వద్ద విద్యుత్ స్తంభాల మార్పిడి చేపడతామని తెలిపారు.ఈ మార్నింగ్ వాక్‌లో 3వ వార్డు సభ్యురాలు కావలి సరోజ ఉషన్న, 2వ వార్డు సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి, గ్రామ పెద్దలు ఎస్. రాములు, గొంది రామకృష్ణారెడ్డి, దాసరి పెద్ద చెన్నయ్య, కావలి యాదయ్య, బోయిని కృష్ణయ్య, ఆనంద్ రెడ్డి, జాజిలి మహేష్, వాటర్ మాన్ గొల్ల సోమయ్య, ఏం సాయి కుమార్, ఏం మన్యం, భూపని బాలరాజు, మేకల యాదగిరి, దాసరి వెంకటయ్య, జయరాములు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .