చర్లపల్లి డివిజన్ అభివృద్ధికి పనులకు శ్రీకారం

చర్లపల్లి డివిజన్ అభివృద్ధికి పనులకు శ్రీకారం

_ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

_డ్రైనేజ్, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన • ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబాటు

కుషాయిగూడ, మార్చి 24 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు ఉత్సాహంగా శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. డివిజన్‌లో పలు మౌలిక వసతుల పనులకు ఆయన శంకుస్థాపనలు నిర్వహించారు.కుషాయిగూడలోని పోచమ్మ గుడి సమీపంలో స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ పనుల ద్వారా వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు గణనీయంగా తగ్గి, కాలనీవాసులకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు.అనంతరం చక్రిపురం కాలనీలో సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, రహదారి అభివృద్ధితో రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. అలాగే టీచర్స్ కాలనీలో కూడా సీసీ రోడ్ల పనులను ప్రారంభించి, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి, చర్లపల్లి డివిజన్ నాయకులు, కాలనీ ప్రతినిధులు, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20260324-WA0015

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .