బేతుపల్లిలో సీతారాముల కల్యాణం ఘనంగా.!

బేతుపల్లిలో సీతారాముల కల్యాణం ఘనంగా.!

- శ్రీరామనవమి వేడుకల్లో భక్తుల సందడి.
- అన్నదానం, పానక కైంకర్యాలతో సేవా కార్యక్రమాలు.

సత్తుపల్లి, మార్చి 27(తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలం, బేతుపల్లి గ్రామంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయం పండుగ వాతావరణంలో కళకళలాడగా, భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారి దర్శనం పొందారు. అర్చకులు ప్రతాపరపు శ్రీనివాసాచార్యులు, రామాచార్యులు, సంతోష్ అయ్యగార్లు వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు సీతారాముల కల్యాణ మహిమను వివరిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక సందేశం అందించారు. కల్యాణోత్సవాన్ని కాలసాని గజేంద్రరావు–సుజాత దంపతులు, వారి కుమారుడు మధు–లక్ష్మీ దంపతులు నిర్వహించారు. కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. సీపీ సూర్యనారాయణ–వాణి దంపతులు పానక కైంకర్యాన్ని చేపట్టి సేవలందించారు. గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామి వారి ఆశీస్సులు పొందారు.IMG-20260327-WA0395

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .