జాతీయ లోక్ అదాలత్ విజయవంతం

జాతీయ లోక్ అదాలత్ విజయవంతం

_81,078 కేసులకు పరిష్కారం 

– రూ.34.54 లక్షల పరిహారం

కుషాయిగూడ, మార్చి 28 (తెలంగాణ ముచ్చట్లు):

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యూ ఢిల్లీ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మల్కాజిగిరి ఆధ్వర్యంలో కు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వి. బాల భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సత్తు రవీందర్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగిన కేసులను సులభంగా, వేగంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 25 బెంచ్‌లలో మొత్తం 81,078 కేసులు పరిష్కరించబడ్డాయి. ఇందులో 39 సివిల్ కేసులు, 81,007 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదనంగా బ్యాంకులు, బిఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించిన 32 ప్రీ-లిటిగేషన్ కేసులు కూడా పరిష్కారం పొందాయి.ఈ లోక్ అదాలత్ ద్వారా మొత్తం రూ.34,54,988 పరిహారం చెల్లించబడినట్లు అధికారులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి బి. తిరుపతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నయ్య, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది, బ్యాంకులు, బిఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20260328-WA0078

Tags:

Post Your Comments

Comments

Latest News