హాట్‌స్పాట్లపై ఏసీపీ దృష్టి.!
- ప్రమాదాల నియంత్రణకు చర్యలు.
- ‘అరైవ్ అలైవ్’ అవగాహన.
ప్రమాదాల నియంత్రణకు చర్యలు.
- ‘అరైవ్ అలైవ్’ అవగాహన.
కల్లూరు, మార్చి 31(తెలంగాణ ముచ్చట్లు):
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ప్రత్యేక దృష్టి సారించారు. వి.ఎం. బంజర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకునే హాట్‌స్పాట్లను ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, మున్సిపల్ ప్రతినిధులు, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిస్థితులను సమీక్షించారు. రింగ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్‌ను పరిశీలించిన ఆమె, గ్రీన్ ఫీల్డ్ హైవే వైపు వెళ్లే వాహనాల వేగ నియంత్రణకు సర్వీస్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్ల స్పష్టత కోసం ఇరువైపులా ఉన్న పొదలను తొలగించారు. అనంతరం ‘అరైవ్ అలైవ్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానికులతో సమావేశం నిర్వహించారు. హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు అత్యవసరమని తెలిపారు. కుటుంబాల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని, సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. డివిజన్‌లో వివిధ శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, రోడ్డు భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


Comments