ఎం.ఎలో మెరిసిన అఖిల నాగ రమ్య

ఎం.ఎలో మెరిసిన అఖిల నాగ రమ్య

- బెంగళూరు వేదికపై సత్తా చాటిన ఖమ్మం అమ్మాయి

- తల్లిదండ్రుల కష్టానికి తగిన ప్రతిఫలం

ఖమ్మం బ్యూరో, మార్చి 30(తెలంగాణ ముచ్చట్లు)

ఖమ్మం నగరానికి చెందిన విద్యార్థిని అర్వపల్లి అఖిల నాగ రమ్య జాతీయ స్థాయిలో నిర్వహించిన సి.ఎం.ఎ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి, బెంగళూరు వేదికపై ప్రశంసలు అందుకుని జిల్లా ఖ్యాతిని చాటింది. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఈ విజయంతో తల్లిదండ్రుల కష్టానికి తగిన ప్రతిఫలం అందించడమే కాకుండా, అనేక మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచింది.

ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంకు చెందిన అర్వపల్లి నగేష్ – శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె అయిన అఖిల నాగ రమ్య చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచింది. మౌంట్ ఫోర్ట్ స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివి, పదో తరగతిలో 9.5 జీపీఏతో పాఠశాల టాపర్‌గా నిలిచింది. అనంతరం సాహితి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లోనూ అగ్రశ్రేణి ఫలితాలు సాధించింది.

ఆమె ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా గుంటూరులోని ప్రముఖ ‘మాస్టర్ మైండ్’ కాలేజీలో సి.ఎం.ఎ కోర్సులో చేర్పించారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో అఖిల నాగ రమ్య జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించి, బెంగళూరులో జరిగిన గౌరవ కార్యక్రమంలో ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా అఖిల మాట్లాడుతూ, 'నా విజయానికి ప్రధాన కారణం నా తల్లిదండ్రులే. వారి కష్టం, ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. నా విజయం వారికే అంకితం' అని తెలిపింది.

అఖిల నాగ రమ్య విజయం పట్ల స్థానికులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఆమె చెల్లెలు యువ నాగశ్రీ ప్రస్తుతం గుంటూరులో చార్టెడ్ అకౌంటెన్సీ (సి.ఏ) కోర్సు అభ్యసిస్తుండటం కుటుంబంలో విద్యాపట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. సంకల్పం, కృషి, కుటుంబ సహకారం ఉంటే ఎంతటి ఉన్నత స్థాయికైనా చేరుకోవచ్చని అఖిల విజయం మరోసారి నిరూపించింది.IMG-20260330-WA0046

Tags:

Post Your Comments

Comments

Latest News

గుర్తు తెలియని మృతదేహం కలకలం.! గుర్తు తెలియని మృతదేహం కలకలం.!
సత్తుపల్లి, మార్చి 30(తెలంగాణ ముచ్చట్లు): సత్తుపల్లి సింగరేణి క్వార్టర్స్ ప్రాంతంలోని జామాయిల్ తోటలో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. స్థానికులు గమనించి...
బడ్జెట్‌పై విమర్శల జోరు.!
జేవీఆర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన.
నేలకొండపల్లి బౌద్ధ స్తూపం అభివృద్ధికి కేంద్రం దృష్టి సారించాలి
ఎం.ఎలో మెరిసిన అఖిల నాగ రమ్య
స్మార్ట్ కిడ్జ్ లో ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ విజేతలకు బహుమతుల ప్రధానం.
పెద్దమందడి మండలంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి