పెద్దమందడి మండలంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి

రమేష్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి

పెద్దమందడి మండలంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి

పెద్దమందడి,మార్చి30(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని జిల్లా కార్యదర్శి మరియు పెద్దమందడి మండల కమిటీ ఇంచార్జ్ రమేష్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని వెల్టూర్ గ్రామంలో నిర్వహించిన మండల కమిటీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ..పార్టీ కోసం నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసిన వారికే పదవులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. మండల కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఆశావహుల నుంచి వినతులు స్వీకరించినట్లు తెలిపారు.వారి వివరాలను సమగ్రంగా పరిశీలించి నివేదిక రూపంలో అధిష్టానానికి పంపిస్తామని వెల్లడించారు. మండల కమిటీని ఏప్రిల్ 5లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి, బలోపేతానికి ప్రతి కార్యకర్త చురుకుగా పనిచేయాలని, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

*మండల కమిటీని త్వరగా నియమించాలి*
ఇదిలా ఉండగా, సమావేశంలో పలువురు కార్యకర్తలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మండల కమిటీ ఏర్పాటును ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని కోరారు. రెండేళ్లు దాటినా మండల కమిటీ నియామకం జరగకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పలుమార్లు సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో కార్యకర్తల్లో తీవ్ర నిరాశ నెలకొన్నదని పేర్కొన్నారు.గ్రామ స్థాయిలో పార్టీకి పనిచేస్తున్న కార్యకర్తలIMG-20260330-WA0049కు పదవులు లేకపోవడం వల్ల వారు నిరుత్సాహానికి గురవుతున్నారని, ఇకపై ఆలస్యం చేయకుండా మండల కమిటీని వెంటనే ప్రకటించాలని నాయకత్వాన్ని కోరుతూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా మాజీ ఎస్సీ సెల్ కార్యదర్శి గట్టుమన్యం, పెద్దమందడి మండల్ మాజీ జెడ్పిటిసి వెంకట్ స్వామి, వనపర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, వెల్టూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మోజర్ల సర్పంచ్ చంద్రశేఖర్ , మదిగట్ల సర్పంచ్ రాములు యాదవ్, కొండ రవీందర్ రెడ్డి ,బాబు రెడ్డి,గట్టు యాదవ్, గట్టు దయాకర్, మాజీ సర్పంచ్ రాధాకృష్ణ, సురేష్, సుదర్శన్ రెడ్డి, వెంకట్ రాములు గౌడ్ ,వెంకటేశ్వర్ రెడ్డి,వెంకట్ స్వామి, ముప్పూరి సురేష్, శంకర్ రెడ్డి, డిఎస్ మహేష్, శివశంకర్, వహీద్, వాకిటి నరేష్, ప్రవీణ్ రెడ్డి, గట్టు రమేష్, ఆంజనేయులు, మల్లికార్జున్,శివ కుమార్, రాములు ,శేఖర్, రామకృష్ణ, నరేష్ రెడ్డి, కృష్ణ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గుర్తు తెలియని మృతదేహం కలకలం.! గుర్తు తెలియని మృతదేహం కలకలం.!
సత్తుపల్లి, మార్చి 30(తెలంగాణ ముచ్చట్లు): సత్తుపల్లి సింగరేణి క్వార్టర్స్ ప్రాంతంలోని జామాయిల్ తోటలో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. స్థానికులు గమనించి...
బడ్జెట్‌పై విమర్శల జోరు.!
జేవీఆర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన.
నేలకొండపల్లి బౌద్ధ స్తూపం అభివృద్ధికి కేంద్రం దృష్టి సారించాలి
ఎం.ఎలో మెరిసిన అఖిల నాగ రమ్య
స్మార్ట్ కిడ్జ్ లో ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ విజేతలకు బహుమతుల ప్రధానం.
పెద్దమందడి మండలంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి