ఘనంగా మహావీర్ జయంతి వేడుకలు

ఘనంగా మహావీర్ జయంతి వేడుకలు

_ ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని అహింసా సిద్ధాంతం ప్రాముఖ్యతపై సందేశం

సికింద్రాబాద్, మార్చి 31 (తెలంగాణ ముచ్చట్లు): 

మహావీర్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌లో జైన సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం 2625వ మహావీర్ జయంతిని జరుపుకుంటున్నామని తెలిపారు. సమాజానికి మార్గదర్శకులైన మహాపురుషుల బోధనలు నేటికీ ఎంతో ప్రాసంగికమని పేర్కొన్నారు.“సర్వేజనా సుఖినోభవంతు” అనే భారతీయ ఆలోచన ప్రపంచానికి ఆదర్శమని, కానీ కొందరు విధ్వంసక భావజాలంతో శాంతి భద్రతలను భంగం చేస్తున్నారని అన్నారు.మహావీరుడు బోధించిన అహింసా సిద్ధాంతాన్ని అనుసరించి మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం సాధించారని గుర్తు చేశారు. ప్రస్తుత కాలంలో నరేంద్ర మోడీ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నారని చెప్పారు.అహింసా మార్గాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తేనే “సారే జహాసే అచ్చా” అనే నినాదం సార్థకమవుతుందని తెలిపారు.మహావీర్ జయంతిని ఘనంగా నిర్వహించిన జైన సమాజానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి .చంద్రశేఖర్ , మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జగ్ మోహన్ IMG-20260331-WA0094సింగ్, కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు నర్మదా మల్లికార్జున్, సంపత్, పరాగ్, విజయ్, పవన్‌తో పాటు జైన సమాజ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News