డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం కలెక్టర్‌కు వినతిపత్రం

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం కలెక్టర్‌కు వినతిపత్రం

_భూమి కోల్పోయిన వారికి తక్షణ ఇళ్లు కేటాయించాలని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో విజ్ఞప్తి

చర్లపల్లి, ఏప్రిల్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం విషయంలో ఆలస్యంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం భూమి స్వాధీనం చేసుకొని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదని వారు పేర్కొన్నారు.ఈ సమస్య పరిష్కారం కోసం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మనూ చౌదరి ఐఏఎస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. భూమి కోల్పోయిన లబ్ధిదారులకు తక్షణమే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని కోరారు.ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించి, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, స్థానిక నాయకులు మత్సగిరి, బాలరాజు, రాజు, మహిళలు మరియు పట్టాలు పొందిన లబ్ధిదారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .