జడ్పీహెచ్‌ఎస్‌లో బయోగ్యాస్, ఆర్వో ప్లాంట్ల ప్రారంభం

జడ్పీహెచ్‌ఎస్‌లో బయోగ్యాస్, ఆర్వో ప్లాంట్ల ప్రారంభం

_వోయిత్ టర్బో సిఎస్ఆర్ నిధులతో రూ.5 లక్షల అభివృద్ధి 

– ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

మల్లాపూర్, ఏప్రిల్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

నాచారం ఇండస్ట్రీ పరిధిలోని ప్రముఖ సంస్థ వోయిత్ టర్బో ప్రైవేట్ లిమిటెడ్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిధుల ద్వారా మల్లాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంట్, ఆర్వో వాటర్ ప్లాంట్‌ను స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు వల్ల మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన వంట గ్యాస్ ఖర్చు తగ్గుతుందని తెలిపారు. అలాగే విద్యార్థుల్లో పునరుత్పాదక ఇంధనంపై అవగాహన పెంపొందుతుందని అన్నారు.
ఇకపోతే, లైబ్రరీ అభివృద్ధికి అవసరమైన అల్మారాలు, కుర్చీలు కూడా సంస్థ అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఉపాధ్యాయులు, వోయిత్ టర్బో సంస్థ ప్రతినిధులు ఈశ్వర్ ప్రసాద్ (వైస్ ప్రెసిడెంట్), మోహనరెడ్డి, రాజశేఖర్ రెడ్డి (జనరల్ మేనేజర్లు), ఇంద్రజ, మహేష్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు తండా వాసుగౌడ్, ఫైళ్ల ప్రవీణ్ కుమార్, ధర్మారెడ్డి, కాసం రాజిరెడ్డి, దుల్మిట్టా దయాకర్ రెడ్డి, మెండ రఘువరన్, ప్రమోద్ తదితరులు హాజరయ్యారు.IMG-20260401-WA0097

Tags:

Post Your Comments

Comments

Latest News

భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేలు జరిమానా భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేలు జరిమానా
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్1(తెలంగాణ ముచ్చట్లు) క్షణికావేశంలో భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేల రూపాయలు జరిమానా విదిస్తూ 4వ అదనపు జిల్లా మరియు...
హుజురాబాద్ డివిజన్‌కు నూతన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
సిర్సపల్లి డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ముమ్మరం
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం కలెక్టర్‌కు వినతిపత్రం
స్టార్ హాస్పిటల్‌లో గురుక్కల్‌ను పరామర్శించిన ఎమ్మెల్యేలు
వార్డుల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి:రిహానా కమల్ పాషా.
నేరెడ్‌మెట్‌లో ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్ ప్రారంభం