హుజురాబాద్ డివిజన్‌కు నూతన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ

డా. గొట్టే శ్రవణ్ కుమార్ బాధ్యతలు స్వీకారం

హుజురాబాద్ డివిజన్‌కు నూతన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 01 (తెలంగాణ ముచ్చట్లు):

హుజురాబాద్ డివిజన్ డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిగా (డిప్యూటీ డీఎంహెచ్‌ఓ) ప్రముఖ వైద్యుడు డాక్టర్ గొట్టే శ్రవణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు శంకరపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా సేవలందించిన ఆయన, ప్రజారోగ్య రంగంలో తన అనుభవంతో ఈ కీలక బాధ్యతలను చేపట్టారు.
ఈ సందర్భంగా డా. శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, హుజురాబాద్ డివిజన్‌లో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ వైద్య సేవలు ప్రతి పేదవారికి సులభంగా అందేలా చర్యలు తీసుకుంటానని, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
అంతేకాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపరచడం, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వెల్లడించారు. ఆయన నియామకంపై స్థానికులు, వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .