పామిరెడ్డిపల్లిలో అంగన్వాడీ కేంద్రాల్లో బాలామృతం పంపిణీ

పామిరెడ్డిపల్లిలో అంగన్వాడీ కేంద్రాల్లో బాలామృతం పంపిణీ

పెద్దమందడి,ఏప్రిల్01( తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలు 1 మరియు 2లో ఎన్‌హెచ్‌ఈడీ సమావేశం గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా 7 నెలల నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలకు టేక్ హోమ్ రేషన్  కింద బాలామృతం పంపిణీ చేశారు.సమావేశంలో భాగంగా చిన్నారుల బరువు, ఎత్తును కొలిచి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.బాలామృతం నాణ్యతపై తల్లులు, పిల్లల అభిప్రాయాలను సర్పంచ్ తెలుసుకున్నారు. సకాలంలో బాలామృతం అందకపోతే వెంటనే సమాచారం ఇవ్వాలని తల్లులకు సూచించారు.అలాగే అంగన్వాడీ కార్యకర్తలు సమయపాలన పాటిస్తూ సేవలు అందించాలని సర్పంచ్ ఆదేశించారు.అందిస్తున్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి నాణ్యతను పరీక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ నాయక్, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, సునీత, ఆశా వర్కర్ హేమలత, కమిటీ సభ్యులు, తల్లులు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .