ఈసీఐఎల్‌ చౌరస్తాలో కార్మికుల నిరసన ర్యాలీ

ఈసీఐఎల్‌ చౌరస్తాలో కార్మికుల నిరసన ర్యాలీ

_పని గంటల పెంపు, ఉద్యోగ భద్రతపై ఆందోళన

_ఏఐటీయూసీ నేతల పిలుపు

కుషాయిగూడ, ఏప్రిల్ 1(తెలంగాణ ముచ్చట్లు)

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం జరిగింది.ఈసీఐఎల్‌లోని అంబేద్కర్ కూడలి వద్ద కార్మికులు “బ్లాక్ డే”గా పాటిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వియస్. బోస్ మాట్లాడుతూ, ఈ లేబర్ కోడ్లు కార్మిక వర్గంపై తీవ్రమైన దాడి అని అన్నారు. ఇది చట్టాల మార్పు కాదని, కార్మిక హక్కులను అపహరించే చర్యలని విమర్శించారు. కార్మికుల శ్రమను చౌకగా మార్చి కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా ఈ కోడ్లు రూపొందించబడ్డాయని పేర్కొన్నారు.కొత్త కోడ్ల ద్వారా పని గంటలు పెరగడం వల్ల కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఉద్యోగ భద్రత క్షీణిస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా 300 మందికి లోపు ఉద్యోగులు ఉన్న సంస్థల్లో ప్రభుత్వ అనుమతి లేకుండానే ఉద్యోగాలను తొలగించే అవకాశం కల్పించడం ఆందోళనకరమని అన్నారు. యూనియన్ హక్కులపై పరిమితులు విధించడం వల్ల కార్మికుల స్వరాన్ని అణచివేస్తున్నారని విమర్శించారు.కాంట్రాక్ట్ వ్యవస్థ పెరుగుదలతో పర్మినెంట్ ఉద్యోగాలు తగ్గిపోతాయని, వేతనాలు, బోనస్, సామాజిక భద్రత అంశాలు బలహీనపరుస్తున్నాయని అన్నారు. కార్మిక హక్కుల రక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.నిరసన అనంతరం కుషాయిగూడ పోలీసులు ఏఐటీయూసీ నాయకులను అరెస్ట్ చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జీ. దామోదర్ రెడ్డి, ఏఐటీయూసీ నేతలు ఎస్. శంకర్ రావు, నారా నర్సింహా, జోషి, రాఘవేంద్ర రావు, నర్సింహా రావు, లక్ష్మీనారాయణ, మోహన్, చలం, గండాలు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, టి. సత్య ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260401-WA0095

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .