ఇందిరమ్మ ఇళ్లతో గ్రామంలో పండుగ వాతావరణం

ఇందిరమ్మ ఇళ్లతో గ్రామంలో పండుగ వాతావరణం

ఎల్కతుర్తి, ఏప్రిల్ 1( తెలంగాణ ముచ్చట్లు):

ఎల్కతుర్తి మండలంలోని దండేపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన గృహాల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. చిర్ర మౌనిక–నాగరాజు దంపతుల ఇంటిలో జరిగిన గృహప్రవేశ వేడుక గ్రామంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సర్పంచ్ గొలిపెల్లి సంపత్ గారితో పాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులు చిర్ర రాజయ్య, పప్పుల గంగాధర్, పొలాటి రాజేశ్వర్ రావు, కట్కూరి శ్రీలత–శ్రీనివాస్, గోళ్లేనా రాధికా–ఎల్లయ్యలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇందిరమ్మ కమిటీ మరియు పంచాయతీ కార్యదర్శి సహకారంతో సకాలంలో బిల్లులు మంజూరై నిర్మాణ పనులు పూర్తి కావడంతో తమ కలల ఇంటి సాధన జరిగిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గొలిపెల్లి సంపత్ మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ, లబ్ధిదారులు సమయానికి గృహ నిర్మాణాన్ని పూర్తి చేసి గృహప్రవేశం చేయడం అభినందనీయమని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వ పథకాలు మరింతగా ఉపయోగపడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, ఇతర లబ్ధిదారులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామమంతా ఆనందోత్సాహాలతో కళకళలాడింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేలు జరిమానా భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేలు జరిమానా
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్1(తెలంగాణ ముచ్చట్లు) క్షణికావేశంలో భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేల రూపాయలు జరిమానా విదిస్తూ 4వ అదనపు జిల్లా మరియు...
హుజురాబాద్ డివిజన్‌కు నూతన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
సిర్సపల్లి డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ముమ్మరం
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం కలెక్టర్‌కు వినతిపత్రం
స్టార్ హాస్పిటల్‌లో గురుక్కల్‌ను పరామర్శించిన ఎమ్మెల్యేలు
వార్డుల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి:రిహానా కమల్ పాషా.
నేరెడ్‌మెట్‌లో ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్ ప్రారంభం