వార్డుల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి:రిహానా కమల్ పాషా.
డ్రైనేజీ, శుభ్రతపై ఆదేశాలు.
సత్తుపల్లి, ఏప్రిల్ 1(తెలంగాణ ముచ్చట్లు):
పట్టణంలోని ప్రతి వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపల్ యంత్రాంగం పనిచేస్తోందని మున్సిపల్ చైర్‌పర్సన్ రిహానా కమల్ పాషా తెలిపారు. బుధవారం పట్టణంలోని 22వ వార్డులో ఆమె విస్తృతంగా పర్యటించి స్థానిక పరిస్థితులను పరిశీలించారు. పర్యటనలో భాగంగా వార్డు సభ్యులు, స్థానికులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థలో పూడికతీత, కొత్త కాలువల నిర్మాణంపై చర్చించారు. చెత్త సేకరణ సక్రమంగా జరుగుతోందా అనే విషయాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వార్డు సభ్యులు ప్రస్తావించిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన చైర్‌పర్సన్, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించబోదని స్పష్టం చేశారు. ప్రజల చెంతకే పాలన అందించడమే లక్ష్యమని, వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.


Comments